![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -829లో.. శైలేంద్ర ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నాడని జగతి ఆగి చూస్తుంది. అక్కడే వసుధార, రిషిల ఎంగేజ్మెంట్ ఫొటోస్ కన్పించడంతో శైలేంద్ర ఏం చేస్తున్నాడు మళ్ళీ రిషికి ఏదైన ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నాడా అని ఎలాగైనా శైలేంద్ర ఏం చెయ్యబోతున్నాడో తెలుసుకోవాలని జగతి అనుకుంటుంది.
మరొకవైపు పాండియన్, అతని ఫ్రెండ్స్ ని పిలిచి వసుధార మాట్లాడుతుంది. మీరు నాకు హెల్ప్ చెయ్యాలి. మిషన్ ఎడ్యుకేషన్ గురించి బస్తీలో విజిట్ చేశాను కదా అలా అన్ని బస్తీలలో విజిట్ చేసి మిషన్ ఎడ్యుకేషన్ గురించి చెప్పి వాళ్ళని చదువుకునేలా చెయ్యాలని వసుధార అంటుంది. సరే మేడమ్ మేం ఎలా హెల్ప్ చెయ్యగలమని పాండియన్ అనగానే రిషి సర్ ని మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు తీసుకునేలా ఒప్పించండని వసుధార అనగానే.. వాళ్ళు ఒప్పుకుంటారు. ఆ తర్వాత పాండియన్ , అతని ఫ్రెండ్స్ ఒక్కొక్కరుగా రిషి ని కలిసి మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు తీసుకోండని పేపర్ పై రాసి ఇస్తారు. రిషి మాత్రం అది సైలెంట్ గా చదివి వెళ్ళిపోతాడు.
మరొక వైపు శైలేంద్ర స్నానం చేస్తుండగా ధరణి ఫోన్ తీసుకొని వచ్చి జగతికి ఇస్తుంది. అప్పుడే శైలేంద్ర వచ్చి నా ప్లాన్ ఏంటో మీకు తెలియదని, నీతో తర్వాత మాట్లాడుతా అని ధరణిని అక్కడ నుండి వెళ్ళిపోమంటాడు. ఆ తర్వాత జగతితో శైలేంద్ర మాట్లాడుతాడు. మీరు నాకు తెలియకుండా ప్లాన్ చేసినప్పుడు నేను కూడా మీకు తెలియకుండా ప్లాన్ చేస్తాను కదా.. రిషి ఎక్కడ ఉన్నాడో నాకు తెలిసని శైలేంద్ర అనగానే.. తెలిస్తే ఏం చేస్తావని అప్పుడే అక్కడకు వచ్చిన మహేంద్ర అంటాడు... నాకు నీ కుట్రలు అన్ని తెలిసిపోయాయి కానీ మా అన్నయ్య వల్ల సైలెంట్ గా ఉన్నానని మహేంద్ర చెప్తాడు. రిషి వచ్చిన రాకున్నా DBST కాలేజీ నాది అని శైలేంద్ర చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శైలేంద్ర ఏదో ప్లాన్ చేస్తున్నాడని జగతి అనగానే.. అర్ధం అవుతుంది కానీ ఎంగేజ్మెంట్ ఫోటోస్ తో ఏం చేస్తాడని జగతితో మహేంద్ర అంటాడు వసుధారకి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పమని జగతి అనగానే.. వసుధారకి మహేంద్ర ఫోన్ చేస్తాడు.
శైలేంద్రకి మీరు ఎక్కడ ఉన్నారో తెలిసిపోయింది. మీ ఎంగేజ్మెంట్ ఫోటోస్ తో ఏదో చెయ్యాలని ప్లాన్ చేశాడు జాగ్రత్త అని మహేంద్ర చెప్తాడు. అసలు ఆ శైలేంద్ర రిషి సర్ కి ఏదైనా ప్రాబ్లెమ్ క్రీయేట్ చెయ్యాబోతున్నడా? రిషి సార్ ని జాగ్రత్తగా ఉండమని చెప్పి మెసేజ్ చేస్తుంది కానీ రిషి మెసేజ్ చూడడు కాలేజీ ప్రిన్సిపాల్ తో మాట్లాడుతూ.. మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు తీసుకుంటామని ఆ కాలేజీ వాళ్ళకి చెప్పండని రిషి ప్రిన్సిపాల్ కి చెప్పి బయటకి వస్తాడు. బయట పాండియన్, అతని ఫ్రెండ్స్ కి రిషి మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు తీసుకున్నాడని అర్థం అయి హ్యాపీగా ఫీల్ అవుతూ రిషితో సంతోషంగా మాట్లాడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |